: సొరంగంలో నిలిచిపోయిన ఖత్రా రైలు


ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన శ్రీశక్తి ఎక్స్ ప్రెస్ రైలు ఖత్రా సమీపంలోని సొరంగంలో నిలిచిపోయింది. దాదాపు గంట పాటు రైలు సొరంగంలో నిలిచిపోవడంతో రైలులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వైష్ణో దేవీ ఆలయ సందర్శనకు వెళ్లే భక్తుల కోసం న్యూఢిల్లీ నుంచి ఖత్రా వరకు ప్రయాణించే ఈ రైలును ఇటీవలే మోడీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. బుధవారం తెల్లవారుజామున ఇంకో ఐదు కిలో మీటర్లు ప్రయాణిస్తే ఖత్రా చేరుకుంటామనగా, సొరంగం మార్గంలో వెళుతున్న రైలు ఒక్కసారిగా నిలిచిపోయింది. ఇంజిన్ లో తలెత్తిన సమస్య కారణంగానే రైలు నిలిచిపోయిందని ఆ తర్వాత రైల్వే అధికారులు వెల్లడించారు. మరమ్మతుల అనంతరం గంట తర్వాత రైలు కదలడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

  • Loading...

More Telugu News