: గాజాపై కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడులు
ఈజిప్టు ప్రతిపాదించిన కాల్పుల విరమణ ఒప్పందానికి ససేమిరా అన్న హమాస్ పై ఇజ్రాయెల్ బుధవారం దాడులను తిరిగి ప్రారంభించింది. బుధవారం ఉదయం ఇజ్రాయెల్ జరిపిన దాడుల నేపథ్యంలో ఇప్పటిదాకా మృతి చెందిన వారి సంఖ్య 202కు చేరిందని పాలస్తీనా వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 8 నుంచి కొనసాగుతున్న దాడుల్లో భాగంగా ఇజ్రాయెల్ సైన్యం హమాస్ స్థావరాలున్న గాజాపై 1,500లకు పైగా రాకెట్లను సంధించగా, హమాస్ కూడా వెయ్యికి పైగా రాకెట్లను ఇజ్రాయెల్ భూభాగంపై ప్రయోగించింది.