: జర్నలిస్టు వైదిక్ పై చర్యలకు శివసేన డిమాండ్
తీవ్రవాది హఫీజ్ సయీద్ ను కలసిన సీనియర్ జర్నలిస్టు వేద్ ప్రతాప్ వైదిక్ పై తక్షణ చర్యలు తీసుకోవాలని బీజేపీ మిత్రపక్షం శివసేన కేంద్రాన్ని డిమాండ్ చేసింది. ఇటువంటి పరిణామాలు దేశ సమగ్రతను దెబ్బతీస్తాయని అంటోంది. ముంబయి పేలుళ్లకు ప్రధాన సూత్రధారి అయిన వ్యక్తిని కలవడం దేశద్రోహం కిందకు వస్తుందని ఆరోపించింది. అటు ఇప్పటికే ఈ విషయంపై పార్లమెంటు ఉభయసభల్లో తీవ్ర గందరగోళం రేగిన సంగతి తెలిసిందే.