: శివసేన- ఎంఎన్ఎస్ ల మధ్య ‘వై-ఫై’ యుద్ధం!


శివసేన దివంగత నేత బాల్ థాకరే కుమారుడు, మేనల్లుడి మధ్య తాజాగా ముంబైలో వై-ఫై యుద్ధం నడుస్తోంది. కుమారుడు ఉద్ధవ్ థాకరే శివసేనను నడిపిస్తుండగా, మేనల్లుడు రాజ్ థాకరే మహారాష్ట్ర నవ నిర్మాణ సేన పేరిట వేరు కుంపటి పెట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా నగరంలోని శివాజీ పార్కులో వై-ఫై జోన్ ఏర్పాటుపై వీరిద్దరి మధ్య వార్ నడుస్తోంది. పార్కులో వై-ఫై జోన్ ను తాము ముందుగా ఏర్పాటు చేస్తామంటే, కాదు తామే ముందుగా ఏర్పాటు చేస్తామంటూ రెండు పార్టీలు బాహాబాహీకి దిగుతున్నాయి. తాజాగా మంగళవారం ఎంఎన్ఎస్ అధినేత రాజ్, శివాజీ పార్కులో వై-ఫై సేవలను ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమానికి ముందు శివసేన నేతలు అక్కడ తమ పార్టీ హోర్డింగ్ లు ఏర్పాటు చేశారు. శివాజీ పార్కులో వై-ఫై సేవలను తమ పార్టీ ప్రారంభించనుందని ఈ హోర్డింగ్ లలో వారు పేర్కొన్నారు. వై-ఫై సేవల కోసం పనులు చేపట్టిన ఎంఎన్ఎస్ కార్యకర్తలను శివసేన కార్యకర్తలు గతంలో అడ్డుకోగా, తాజాగా వైర్ లెస్ పరిజ్ఞానంతో ఎంఎన్ఎస్ పని కానిచ్చేసింది.

  • Loading...

More Telugu News