: గవర్నరుతో చంద్రబాబు, మంత్రి గంటా భేటీ
గవర్నరు నరసింహన్ తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సమావేశమయ్యారు. ఇంజినీరింగ్ లో అడ్మిషన్లు, ఫీజు రీయింబర్స్ మెంట్ పై తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై బాబు గవర్నర్ సలహా కోరారు. ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసినా కేసీఆర్ పట్టించుకోలేదని ఆయన గవర్నరుకు చెప్పారు.