: తెలంగాణలో పార్ట్ టైమ్ లెక్చరర్ల సర్వీస్ ఏడాది పొడిగింపు


పార్ట్ టైమ్ లెక్చరర్ల సర్వీసును ఏడాది కాలం పాటు పొడిగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మొత్తం 585 మంది పార్ట్ టైమ్ లెక్చరర్లు పనిచేస్తున్నారు. వారి సర్వీసును ఏడాది కాలం పాటు పొడిగిస్తూ టీ-ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న లెక్చరర్లకు ఇది వర్తిస్తుంది. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం పట్ల పార్ట్ టైమ్ లెక్చరర్లు సంతోషం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News