: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో వరుసగా ఆరో రోజూ భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి వేచి ఉన్న భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. వెలుపలకు సుమారు కిలో మీటరు వరకు భక్తుల క్యూలైన్ ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం, నడకదారి భక్తులకు 8 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని టీటీడీ అధికారులు రద్దు చేశారు.