: వైన్ షాపుల్లో ‘చిల్లర’ కూపన్లు
హైదరాబాదులో చిల్లర సమస్యను ఎదుర్కోవడానికి వైన్ షాపు యజమానులు ఓ కొత్త పద్ధతిని అమలు చేస్తున్నారు. ‘ఐ ప్రామిస్ టు పే’ పేరుతో ముద్రించిన రూ.2, రూ.5 కూపన్లను వినియోగదారులకు అందజేస్తున్నారు. దీనిపై కస్టమర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ కూపన్ మార్చుకోవాలంటే మళ్లీ సదరు షాపుకు వెళ్లి మద్యం కొనుక్కోవలసిందే. ఈ తరహా కూపన్ల పంపిణీతో చిల్లరకు చెక్ పెట్టేస్తున్నారు. అయితే, చిల్లర కూపన్లను చెలామణీ చేయడం ఆర్థిక నేరం కిందకు వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.