: వరంగల్ చుట్టూ ఔటర్ రింగు రోడ్డు: కేసీఆర్
వరంగల్ నగరం చుట్టూ ఔటర్ రింగు రోడ్డు నిర్మిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. హైదరాబాదు-వరంగల్ మధ్య పారిశ్రామిక కారిడార్ ను రూపొందించనున్నట్లు ఆయన చెప్పారు. ఇవాళ ముఖ్యమంత్రి పరిశ్రమల శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. పరిశ్రమల ఏర్పాటుకు కావలసిన అన్ని అనుమతుల కోసం సింగిల్ విండో పద్ధతిని అమలు చేయాలని అధికారులకు సూచించారు. ప్రాజెక్టుల్లో 10 శాతం తాగునీటిని పరిశ్రమల కోసం కేటాయించాలని కేసీఆర్ చెప్పారు.