: కూకట్ పల్లిలో రూ. 8 లక్షలు చోరీ
హైదరాబాదులోని కూకట్ పల్లిలో మంగళవారం భారీ చోరీ జరిగింది. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు తన వద్ద నుంచి రూ. 8 లక్షలను అపహరించుకునిపోయారని బాధితుడు సమీపంలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఐడీబీఐ బ్యాంకు వద్ద చోటుచేసుకున్న ఈ ఘటనపై ఫిర్యాదునందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.