: కాల్పుల విరమణకు ఒప్పుకోకపోతే కఠిన చర్యలు తప్పవు: ఇజ్రాయెల్ ప్రధాని


ఈజిప్టు ప్రతిపాదించిన కాల్పుల విరమణకు ఒప్పుకోని పక్షంలో హమాస్ తగిన మూల్యం చెల్లించక తప్పదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించారు. హమాస్ అధీనంలోని గాజాపై వారం రోజులుగా ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో పెద్ద సంఖ్యలో పాలస్తీనియన్లు మృతి చెందారు. మంగళవారం ఉదయం ఈజిప్టు ఫ్రతిపాదించిన కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ సరేనన్నా, హమాస్ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో బెంజమిన్, ఇజ్రాయెల్ లో పర్యటిస్తున్న జర్మనీ విదేశాంగ మంత్రి ఫ్రాంక్ వాల్టర్ తో కలిసి విలేకరులతో మాట్లాడారు. హమాస్ దారికి రాని పక్షంలో ప్రపంచ దేశాల మద్దతుతో దాడులను విస్తృతం చేయాల్సి ఉంటుందని ఈ సందర్భంగా బెంజమిన్ నెతన్యాహు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News