: సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష వాయిదా
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష వాయిదా పడింది. పరీక్షను వాయిదా వేయాలంటూ కేంద్రం యూపీఎస్సీని కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో, ఆగస్టు 24న జరగాల్సిన పరీక్షను యూపీఎస్సీ వాయిదా వేసింది. అయితే, తిరిగి పరీక్షను ఎప్పుడు నిర్వహించేదీ ఇంకా ప్రకటించలేదు.