: గుజరాత్ లో ఐదో ఎన్ఎస్ జీ కేంద్రం


నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్ జీ) ఐదో ప్రాంతీయ కేంద్రాన్ని గుజరాత్ లో ఏర్పాటు చేయనున్నట్లు మంగళవారం కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు లోక్ సభకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఎన్ఎస్ జీ కేంద్రం ఏర్పాటుకు సంబంధించి ఉచితంగా స్థలాన్ని ఇవ్వనున్నట్లు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం రెండు చోట్ల స్థలాన్ని కూడా ప్రతిపాదించిందని మంత్రి చెప్పారు. ఎన్ఎస్ జీ అధికారులు కూడా రెండు స్థలాలను పరిశీలించి నివేదిక అందించారని, దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News