: సమష్టి కృషితో ముందుకెళదాం: జిల్లా అధికారులతో చంద్రబాబు
సమష్టి కృషితో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిద్దామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా అధికారులకు పిలుపునిచ్చారు. మంగళవారం సాయంత్రం రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన కలెక్టర్లు, వివిధ శాఖాధిపతులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు విభాగాల ప్రగతిపై ఆరా తీసిన చంద్రబాబు, భవిష్యత్తులో మరింత మెరుగైన పనితీరు కనబరచేలా పనిచేయాలని అధికారులకు సూచించారు.