: నిజమే... భారత్ గగనతలంలో చైనా హెలికాఫ్టర్లు తిరిగాయి: అరుణ్ జైట్లీ


రెండు నెలల క్రితం చైనా హెలికాఫ్టర్లు రెండు పర్యాయాలు భారత గగనతలంలోకి దూసుకొచ్చిన మాట వాస్తవమేనని రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. ఈ మేరకు ఆయన మంగళవారం రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఇరుదేశాల మధ్య సరిహద్దు రేఖపై స్పష్టత లేని కారణంగానే ఈ తరహా ఘటనలు చోటుచేసుకుంటున్నాయని చెప్పిన ఆయన, తాజా ఘటనలపై భారత సైన్యం తమ నిరసనను చైనాకు తెలియజేసిందని తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ 30, జూన్ 13న రెండు చైనా హెలికాఫ్టర్లు భారత భూభాగంలోని ఉత్తరాఖండ్ గగనతలంలో చక్కర్లు కొట్టడం కలకలం రేపింది.

  • Loading...

More Telugu News