: ఉల్లిపాయలు కొంటున్నారా?.. అయితే, రైతుబజారుకు వెళ్లండి!
'ఉల్లి ధరలు తగ్గించండి మహాప్రభో' అంటున్న వినియోగదారుల గోడును ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం అర్థం చేసుకుంది. ఉల్లిపాయల ధరలను అదుపు చేసే చర్యలను టీ-ప్రభుత్వం ప్రారంభించింది. అందులో భాగంగా హైదరాబాదులోని రైతుబజార్లలో మార్కెట్ ధర కన్నా తక్కువ ధరకు ఉల్లిపాయలను విక్రయించేందుకు మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసింది. బహిరంగ మార్కెట్లో ఉల్లిపాయలు కిలో రూ.30 నుంచి 40 పలుకుతున్నాయి. రైతుబజార్లలో వీటిని కిలో 22 రూపాయలకే వినియోగదారులకు అందిస్తారు. అయితే, ఈ కౌంటర్లు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు మాత్రమే పనిచేస్తాయని మార్కెటింగ్ శాఖ పేర్కొంది.