: 'నగరం' బాధితులకు మరింత సాయం చేయాల్సిందే: తూ.గో. జిల్లా పరిషత్ చైర్మన్


గ్యాస్ లీకైన ఘటనలో బుగ్గిపాలైన నగరం గ్రామానికి చెందిన బాధితులకు మరింత సహాయం చేయాలని తూర్పు గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ నామాన రాంబాబు డిమాండ్ చేశారు. సహాయక చర్యలపై మంగళవారం కాకినాడలోని జిల్లా పరిషత్ భవనంలో రాంబాబు గెయిల్ అధికారులతో చర్చలు జరిపారు. మంటల ధాటికి కాలిపోయిన కొబ్బరి చెట్టు ఒక్కింటికి రూ. 6 వేల చొప్పున పరిహారంతో పాటు గాయాలపాలైన వారికి రూ. 5 లక్షల చొప్పున పరిహారం అందించాలని రాంబాబు కోరారు. కాలిపోయిన ఇళ్ల స్థానంలో నూతన నివాసాలు నిర్మించడంతో పాటు బాధితులకు కుటుంబానికి ఒకటి చొప్పున ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధితుల తరఫున వ్యక్తమైన డిమాండ్లను నోట్ చేసుకున్న గెయిల్ జీఎం విశ్వనాథ్, తమ చైర్మన్ తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

  • Loading...

More Telugu News