: ఆ క్షణాల్లో చాలా ప్రశాంతంగా ఉన్న అఫ్జల్!
ఉరిశిక్ష అంటే ఎవరైనా భయంతో వణికిచస్తారు. ఇక మరికొన్ని క్షణాలలో తను ఈ భూమి మీద వుండడు ... అన్న భావన ఎంతటి వాడినైనా గిజగిజా కొట్టుకునేలా చేస్తుంది. పాకిస్తాన్ మాజీ ప్రధాని భుట్టో అంతటి వాడే.. తనకి ఉరిశిక్ష అమలవుతున్న చివరి క్షణాలలో రానని మొండిచేస్తే... బలవంతంగా ఉరికంభం వద్దకు లాక్కుపోయారు. అయితే, ఏమాత్రం గాభరా పడకుండా ఉరికంభం వద్దకు ప్రశాంతంగా వెళ్ళిన సద్దామ్ హుస్సేన్ లాంటి వాళ్ళూ వున్నారు. ఈ రోజు ఉరి కంభమెక్కిన అఫ్జల్ గురు కూడా ప్రశాంతంగా కనిపించాడట!
తను మరికొన్ని క్షణాలలో ఉరి కంభానికి వేలాడబోతున్నానన్న విషయం తెలిసి కూడా అఫ్జల్ ఏమాత్రం తొట్రుపాటుకీ గురి కాలేదట. చాలా ప్రశాంత వదనంతో కనిపించాడని జైలు సిబ్బంది చెబుతున్నారు. తెల్లవారు జామున ముందుగా ప్రార్థనలు చేసుకున్నాడనీ, ఆ తర్వాత అతనికి వైద్య పరీక్షలు నిర్వహించి శిక్షకు సిద్ధం చేసామని జైలు అధికారులు చెప్పారు. అదే ప్రశాంతతతో ... ఏమాత్రం ప్రతిఘటించకుండా... అఫ్జల్ ఉరికంభమెక్కాడట!