: ఆర్టికల్ 370ని రద్దుచేసే ప్రతిపాదన లేదు: కేంద్రం
జమ్మూకాశ్మీర్ కు ప్రత్యేక హోదాను కట్టబెట్టే ఆర్టికల్ 370ని ఉపసంహరించుకునే ప్రతిపాదన లేదని కేంద్ర ప్రభుత్వం ఈ రోజు లోక్ సభలో స్పష్టం చేసింది. నేడు సభలో తృణమూల్ కాంగ్రెస్ నేత సౌగత్ రాయ్ మాట్లాడుతూ, ఆర్టికల్ 370ని రద్దుచేసే ప్రతిపాదన ఏదైనా ఉందా? అని ప్రశ్నించారు. అందుకు హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజ్జు 'లేదు' అని లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.