: చెన్నై భవనం కూలిన ఘటనలో మహిళా ఆర్కిటెక్ట్ కు హైకోర్టులో చుక్కెదురు
చెన్నైలో బహుళ అంతస్తుల భవనం కూలిన ఘటనకు సంబంధించి మహిళా ఆర్కిటెక్ట్ కు మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది. ఆ భవన నిర్మాణంలో సుకన్య అనే మహిళా ఆర్కిటెక్ట్ కీలక భూమిక పోషించారు. రెండు వారాల క్రితం భవనం కుప్పకూలిన ఘటనలో 61 మంది చనిపోయారు. ఈ క్రమంలో భవన నిర్మాణాన్ని చేపట్టిన సంస్థపై చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలన్న సుకన్య వినతిని మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఈ కేసులో సుకన్యపై మోపిన అభియోగాలు తీవ్రమైనవని పేర్కొన్న న్యాయమూర్తి, సుకన్యకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించారు. పునాది ఎంత లోతులో ఉండాలన్న అంశంపై కూడా ఆర్కిటెక్టులు సూచనలివ్వకపోతే ఎలాగంటూ జడ్జి మండిపడ్డారు.