: పరకాలలో 7, కూనవరం, ములుగులో 5 సెం.మీ. వర్షపాతం నమోదు
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా పరకాలలో 7 సెం.మీ. వర్షపాతం నమోదైంది. పాల్వంచ, కూనవరం, ములుగులో 5 సెం.మీ... భద్రాచలం, బయ్యారం, డోర్నకల్, ఖానాపూర్ లో 4... ఇల్లెందు, ఇబ్రహీంపట్నం, మణుగూరు, ముథోల్, టేకులపల్లిలో 3 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖాధికారులు వెల్లడించారు. మరో మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాదులోని వాతావరణ కేంద్రం తెలిపింది. ఖమ్మం, వరంగల్, ఆదిలాబాదు, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.