: కేసీఆర్ నా కాళ్లు మొక్కినా సరే టీఆర్ఎస్ లో చేరబోను: రేవంత్ రెడ్డి


టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పాటు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు వచ్చి తన ఇంటిముందు లైన్ లో నిలుచుని.... తన కాళ్లు మొక్కినా సరే తాను టీఆర్ఎస్ పార్టీలో చేరబోనని టీడీపీ నాయకుడు రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ఓ ఛానెల్ లైవ్ డిస్కషన్ లో ఈ మేరకు ఈ విషయం పై ఆయన క్లారిటీ ఇచ్చారు. తాము అమెరికా పర్యటనలో ఉండగా తెలంగాణలో టీడీపీని మరింత బలహీనపరచడానికి టీఆర్ఎస్ విషప్రచారానికి పూనుకుందని ఆయన అన్నారు. టీడీపీని దెబ్బతీసేందుకు గత కొన్ని రోజులుగా టీఆర్ఎస్ తో పాటు 'సాక్షి' పత్రిక తమ మీద గోబెల్స్ ప్రచారం చేస్తున్నదని ఆయన దుయ్యబట్టారు

  • Loading...

More Telugu News