: సన్ రైజర్స్ ముంగిట భారీ టార్గెట్


కోల్ కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాట్స్ మెన్ సత్తా చాటాల్సిన తరుణం ఆసన్నమైంది. ఈ సాయంత్రం కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్ లో జరుగుతున్న పోరులో టాస్ గెలిచిన నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 180 పరుగుల భారీ స్కోరు సాధించారు. కెప్టెన్ గంభీర్ (53) హాఫ్ సెంచరీతో అదరగొట్టగా కలిస్ (41), మోర్గాన్ (47) రాణించారు. ముఖ్యంగా మోర్గాన్ కేవలం 21 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్సులతో వేగంగా పరుగులు సాధించాడు. సన్ రైజర్స్ ప్రధాన బౌలర్లు ఒక్క వికెట్ కూడా తీయలేక ఉసూరుమనిపించారు.

  • Loading...

More Telugu News