: అనంతపురాన్ని ఐటీ హబ్ గా చేయాలి: శైలజానాథ్
రాష్ట్ర విభజన తర్వాత కూడా అభివృద్ధి అంతా ఒక్కచోటే కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ నేత శైలజానాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తం అభివృద్ధి ఒకే ప్రాంతంలో జరిగితే అది అనర్థాలకు దారి తీస్తుందన్నారు. కేంద్రం ప్రకటించిన 13 సంస్థలను కృష్ణా, గుంటూరులో పెట్టడం సరికాదని ప్రభుత్వానికి సూచించారు. ఈ క్రమంలో అనంతపురాన్ని ఐటీ హబ్ గా చేయాలని, ఎయిమ్స్ ను కూడా అక్కడే ఏర్పాటు చేయాలని కోరారు.