: ఒడిశాలో ముగ్గురు టీచర్ల దుర్మరణం


ఒడిశాలోని సంబల్పూర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ జీపు చెట్టును ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు టీచర్లు ప్రాణాలు విడిచారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదం గతరాత్రి చహత్ పాదా ప్రాంతానికి 85 కిలోమీటర్ల దూరంలో జరిగిందని పోలీసులు తెలిపారు. మృతులను రజనీకాంత సాహు, అతని సోదరుడు రమాకాంత సాహు, శ్రీధర్ మాఝిగా గుర్తించారు. వీరంతా ఆంగుల్ ప్రాంతం నుంచి స్వస్థలానికి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన సంభవించింది.

  • Loading...

More Telugu News