: క్లాస్ రూమ్ లో చిన్నారిని కాటేసిన పాము
క్లాస్ రూమ్ లో ఓ చిన్నారిని పాము కాటేసింది. పాముకాటుకు గురైన ఆ చిన్నారి తరగతి గదిలోనే ప్రాణాలు విడిచింది. ఈ విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. బెల్లంపల్లి మండలం బట్వానపల్లిలో ఎల్ కేజీ చదువుకున్న బాలిక పాముకాటుకు గురై కన్నుమూయడంతో అక్కడ విషాదం నెలకొంది.