: గుంటూరులో వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్
గుంటూరులో వెయ్యి మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ విద్యుదుత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ వెల్లడించారు. ఏపీలో విద్యుత్ పంపిణీపై మంగళవారం జెన్ కో, ట్రాన్స్ కోలతో భేటీ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2020 వరకు విద్యుత్ డిమాండ్, ఉత్పత్తి విషయాలకు సంబంధించి అంచనాలను రూపొందించనున్నామన్నారు. 24 గంటల విద్యుత్ సరఫరా అంశంపై వారంలోగా కేంద్రానికి నివేదిక ఇస్తామని ఆయన చెప్పారు.