: మిత్రులతో మనకు జన్యు సారూప్యత ఉంటుందట!
మనం మిత్రులుగా ఎంచుకునే వ్యక్తులకు, మనకు... జన్యు సారూప్యత ఉంటుందంటున్నారు యేల్ యూనిర్శిటీ పరిశోధకులు. వ్యక్తుల జన్యుపటాన్ని మొత్తం పరిశీలిస్తే, సగటున మన మిత్రులతో జన్యుపరంగా ఏకరూపత కలిగి ఉంటామని ప్రొఫెసర్ జేమ్స్ ఫోలర్ తెలిపారు. కొత్తవాళ్ల కంటే, మనం స్నేహితులుగా ఎంచుకునేవారి డీఎన్ఏకు మన డీఎన్ఎ దగ్గరగా ఉంటుందని పేర్కొన్నారు. మొత్తం 15 లక్షల మంది జన్యువులను పరిశీలించిన పిదప పరిశోధకులు ఈ నిర్ణయానికి వచ్చారు. ఎలాంటి బంధుత్వంలేని స్నేహితుల జంటలు, ఎలాంటి బంధుత్వంలేని కొత్తవాళ్ళ జంటల జన్యుక్రమాన్ని పరిశీలించారు.