: తీవ్రవాది హఫీజ్ సయీద్ తో వైదిక్ భేటీ వ్యక్తిగతం: సుష్మాస్వరాజ్


తీవ్రవాది, 26/11 పేలుళ్ల ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్ ను జర్నలిస్టు వేద్ ప్రతాప్ వైదిక్ కలవడం, ఇంటర్వ్యూ చేయడం కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పడేసింది. ఈ విషయంపై రెండు రోజుల నుంచి విపక్షాలన్నీ పార్లమెంటు ఉభయసభల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. ఈ మేరకు లోక్ సభలో నేడు సమాధానమిచ్చిన విదేశాంగ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్, హఫీజ్ తో వైదిక్ భేటీ వ్యక్తిగతమన్నారు. భేటీకి ప్రభుత్వం ఎలాంటి సాయం చేయలేదని స్పష్టం చేశారు. దీనిపై ప్రభుత్వానికి ఎటువంటి సమాచారం కూడా లేదని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. అటు రాజ్యసభలో కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ మాట్లాడుతూ, ఇటువంటి ఘటనలు దేశ భద్రతకు ప్రమాదమని, ఇండియన్ ఎంబసీ ప్రమేయం లేకుండా భేటీ జరిగిందా? అని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News