: బయ్యారం ఫ్యాక్టరీతో గిరిజనులకు మెరుగైన ఉపాధి: పొంగులేటి


బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం ద్వారా ఖమ్మం జిల్లాతో పాటు వరంగల్ జిల్లాలోని గిరిజనులకు కూడా మెరుగైన ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం ఈ అంశాన్ని పార్లమెంట్ లో ప్రస్తావించిన ఆయన మంగళవారం ఖమ్మంలో మీడియాతో మాట్లాడారు. ఖమ్మం జిల్లా బయ్యారం పరిసర ప్రాంతాల్లో లక్షలాది ఎకరాల మేర ఇనుపరాయి నిక్షేపాలున్న విషయాన్ని ప్రస్తావించిన ఆయన, ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై కేంద్రం చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News