: మైక్రోసాఫ్ట్ లో ఇక ఉద్యోగాల కోత!
సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన సిబ్బందిని తగ్గించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రానున్న ఐదేళ్లలో భారీ ఎత్తున ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు ఇటీవలే సంస్థ పగ్గాలు చేపట్టిన సత్య నాదెళ్ల సమాయత్తమవుతున్నారని పుకార్లు వినిపిస్తున్నాయి. గతేడాది ఫిన్లాండ్ మొబైల్ తయారీ సంస్థ నోకియాను విలీనం చేసుకున్న తర్వాత మైక్రోసాఫ్ట్ లో మొత్తం సిబ్బంది సంఖ్య 1,27,000 లకు చేరింది. దీంతో తన ప్రత్యర్థులు యాపిల్, గూగుల్ ల కంటే భారీ స్థాయిలో ఉద్యోగులను మైక్రోసాఫ్ట్ కలిగి ఉంది. దీంతో ఉద్వాసన ప్రక్రియలో భాగంగా నోకియా నుంచి వచ్చిన ఉద్యోగులతో పాటు తాను నేరుగా నియమించుకున్న సిబ్బందిపైనా వేటు వేసేందుకు సంస్థ సిద్ధమవుతోందట. ఇదిలా ఉంటే, కోతల ప్రక్రియ ఈ వారంలోనే మొదలయ్యే అవకాశాలున్నాయంటూ వార్తలు వెలువడుతున్నాయి.