: హైదరాబాదు పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత తాత్కాలిక వాయిదా


హైదరాబాదు పరిధిలో ఈ రోజు చేపట్టిన అక్రమ నిర్మాణాల కూల్చివేతను జీహెచ్ఎంసీ తాత్కాలికంగా నిలిపివేసింది. తగినంత పోలీసు బందోబస్తు లేని కారణంగా కూల్చివేతను ప్రస్తుతానికి ఆపివేస్తున్నట్లు ప్రకటించింది. వాస్తవానికి హఫీజ్ పేట గోకుల్ ఫ్లాట్స్ పరిధిలో నిర్మాణాల కూల్చివేతకు ఇవాళ అధికారులు సిద్ధమయ్యారు. అటు శేరిలింగంపల్లి, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లోనూ కూల్చివేతకు ఆదేశాలు ఇచ్చారు. అయితే, చివరి నిమిషంలో కూల్చివేతను ఆపాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి.

  • Loading...

More Telugu News