: మరో రసవత్తర పోరుకు సన్ రైజర్స్ రెడీ


సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ ఆరవ సీజన్ లో దూసుకుపోతోంది. డెక్కన్ చార్జర్స్ పేరిట గత సీజన్లో పరాజయ పర్వాలను లిఖించిన ఈ ఆటగాళ్ళ బృందం తాజా టోర్నీలో ఆ ఛాయలను మరిపించేలా అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటివరకు 4 మ్యాచ్ లాడిన సన్ రైజర్స్ 3 పోటీలను నెగ్గి ఒకదాంట్లో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో కోల్ కతా నైట్ రైడర్స్ తో పోరుకు సిద్ధమైంది. కాగా, ఈ రెండు జట్ల మధ్య ఈ టోర్నీలో ఇదే తొలి మ్యాచ్. సన్ రైజర్స్ భారీ విజయాలతో ఊపుమీదుండగా.. వరుస పరాజయాలతో ఢీలాపడిన నైట్ రైడర్స్ పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో కొనసాగుతోంది. నేటి మ్యాచ్ సొంత గడ్డపై ఆడనుండడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. అందుకే టాస్ గెలిచిన నైట్ రైడర్స్ సారథి గంభీర్ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

  • Loading...

More Telugu News