: 25 అడుగులు చొచ్చుకు వచ్చిన సముద్రం... ఇళ్లను తాకుతున్న అలలు


అల్పపీడన ప్రభావంతో బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారింది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అలలు ఎగసిపడుతున్నాయి. విశాఖలో భారీ అలలతో బీచ్ కోతకు గురవుతోంది. సబ్ మెరైన్ మ్యూజియం దగ్గర ఈ కోత మరింత ఎక్కువగా ఉంది. భీమిలి, చేపలుప్పాడ, మంగమారిపేట దగ్గర అలలు ఉగ్రరూపం దాల్చాయి. మంగమారిపేటలో సముద్రపు నీరు ఇళ్లను తాకుతోంది. దీంతో, స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని 197 కి.మీ. తీరప్రాంతంలో సముద్రం ఏకంగా 25 అడుగుల మేర ముందుకు చొచ్చుకు వచ్చింది. కళింగపట్నం, బందరువానిపేట, వజ్రపుకొత్తూరు మండలాల్లో అలలు ఎగసిపడుతున్నాయి. తీరం వెంబడి 50 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదంటూ వాతావరణ శాఖ హెచ్చరించింది.

  • Loading...

More Telugu News