: జర్మనీ విజయానికి గుర్తుగా ప్రత్యేక స్టాంపులు


ఫిఫా వరల్డ్ కప్ విజయానికి గుర్తుగా జర్మనీ ప్రభుత్వం ప్రత్యేక స్టాంపులు రూపొందించింది. ఫైనల్ మ్యాచ్ జరగకముందే ఈ స్టాంపులను ముద్రించడం విశేషం. మొత్తం ఐదు లక్షల స్టాంపులను ఈ వారంలో అందుబాటులోకి తేనున్నారు. దీనిపై జర్మనీ ఆర్థిక మంత్రి వుల్ఫ్ గాంగ్ షాబెల్ మాట్లాడుతూ, తమ జట్టు విజయం సాధిస్తుందని ముందుగానే ఊహించామని పేర్కొన్నాడు. తొలుత కోచ్ తో పాటు, జట్టు సభ్యులకు ఈ ప్రత్యేక స్టాంపులు బహూకరించిన తర్వాత గురువారం నుంచి అమ్మకాలు ప్రారంభిస్తారు. ఒక్క స్టాంపు విలువ 60 సెంట్లుగా నిర్ణయించారు. ఈ స్టాంపుపై 'జర్మనీ ఫుట్ బాల్ వరల్డ్ చాంపియన్ 2014' అన్న అక్షరాలను ముద్రించారు.

  • Loading...

More Telugu News