: మోడీ, పుతిన్ భేటీ షెడ్యూల్లో మార్పు
బ్రెజిల్ లోని ఫోర్టాలెజాలో బ్రిక్స్ దేశాల సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమావేశం జరగనుంది. అయితే, తొలుత అనుకున్న విధంగా కాకుండా భేటీ షెడ్యూల్లో మార్పులు చేయనున్నారు. వాస్తవానికి చైనా అధ్యక్షుడు ఝి జిన్ పింగ్ తో భేటీ అనంతరం మోడీ... పుతిన్ తో సమావేశమవ్వాలని నిర్ణయించారు. అయితే, పుతిన్... బ్రెజిల్ ప్రెసిడెంట్ దిల్మా రౌసెఫ్ తో చర్చలకు కూర్చోనుండడంతో మోడీతో సమావేశం రీషెడ్యూల్ చేయాలని నిర్ణయించారు.