: నేడు మరోసారి గురుకుల్ ట్రస్ట్ అక్రమనిర్మాణాల కూల్చివేత


నేడు గురుకుల్ ట్రస్ట్ భూముల్లో మరోసారి అక్రమ నిర్మాణాల కూల్చివేతకు జీహెచ్ ఎంసీ అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు నిర్మాణంలో ఉన్న 24 భవనాలను కూల్చిన అధికారులు... ఈరోజు నిర్మాణం పూర్తి చేసుకున్న భవనాలను కూల్చివేయనున్నారు. ఈ నేపథ్యంలో, అయ్యప్ప సొసైటీలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. హైదరాబాదులో మొత్తం 890 అక్రమ నిర్మాణాలను జీహెచ్ ఎంసీ అధికారులు గుర్తించారు. వీటిలో ప్రస్తుతానికి (తొలిదశ) 172 కట్టడాలను నేడు కూల్చివేయనున్నారు. వచ్చే వారంలో మరో 32 నిర్మాణాలను కూల్చివేయాలని భావిస్తున్నారు. మొత్తం మూడు దశల్లో అక్రమ నిర్మాణాలన్నింటినీ నిర్మూలించాలని యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు.

  • Loading...

More Telugu News