: ధోనీ వేస్ట్... కోహ్లీయే బెస్ట్: ఇయాన్ చాపెల్
టీమిండియా టెస్ట్ కెప్టెన్ పదవి నుంచి ధోనీని సాగనంపాలని కోరేవారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ కూడా ఈ లిస్టులో చేరాడు. టెస్ట్ కెప్టెన్ గా ధోనీని తప్పించి యువ సంచలనం కోహ్లీకి నాయకత్వం అప్పగించాల్సిన సమయం ఆసన్నమయిందని చాపెల్ చెప్పాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ కు మాత్రం ధోనీ అద్భుత నాయకుడంటూ కితాబిచ్చిన చాపెల్... టెస్ట్ క్రికెట్ కు మాత్రం ధోనీ సరైన నాయకుడు కాదని స్పష్టం చేశాడు. 27 ఏళ్ల వయసున్న కోహ్లీ జట్టు నాయకత్వ బాధ్యతలు చేపట్టడానికి ఇదే సరైన సమయమని తెలిపాడు. భారత జట్టును నడిపించడానికి యువనాయకత్వం అవసరమని చెప్పాడు.