: నేటి నుంచే 'బ్రిక్స్' సమావేశాలు... చైనా, రష్యా అధ్యక్షులతో సమావేశం కానున్న మోడీ


6వ 'బ్రిక్స్' శిఖరాగ్ర సమావేశం నేడు బ్రెజిల్ లో ప్రారంభం కానుంది. ఈ సదస్సు రెండు రోజుల పాటు జరుగుతుంది. బ్రిక్స్ దేశాలైన బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా దేశాధినేతలు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. బ్రెజిల్ నగరాలైన ఫోర్టలెజా, బ్రసిలియాలలో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో పాల్గొనడానికి బ్రిక్స్ దేశాధినేతలు ఇప్పటికే బ్రెజిల్ చేరుకున్నారు. సమావేశానికి ముందే మన ప్రధాని నరేంద్ర మోడీ రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో వ్యక్తిగతంగా సమావేశమవుతారు. ఈ సమావేశంలో ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు. బ్రిక్స్ సమావేశాల్లో భద్రతా ముప్పులు, అంతర్జాతీయ సంక్షోభాలు, శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడం, ఆర్థిక సుస్థిరత సాధించడం తదితర అంశాలపై చర్చిస్తారు. అంతేకాకుండా, అభివృద్ధి బ్యాంకులో సమాన వాటా కోసం భారత్ పట్టుబట్టనుంది. ప్రధాని వెంట కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, భద్రతా సలహాదారు దోవల్, విదేశాంగ కార్యదర్శి సుజాతా సింగ్ లతో కూడిన అత్యున్నత స్థాయి బృందం ఉంది.

  • Loading...

More Telugu News