: మేనకా గాంధీ వ్యాఖ్యలకు నిర్భయ తండ్రి మద్దతు


అత్యాచార కేసుల్లో బాల నేరస్థులను వేరుగా చూడకూడదని, వారిని కూడా పెద్దవారిగానే పరిగణించి శిక్షలు వేయాలన్న కేంద్ర మంత్రి మేనకా గాంధీ వ్యాఖ్యలకు భారీ మద్దతు లభిస్తోంది. ఇప్పటికే మేనకాగాంధీ వాదనను దేశవ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాలు సమర్థించాయి. తాజాగా నిర్భయ తల్లిదండ్రులు కూడా సమర్థించారు. నిర్భయ తండ్రి మీడియాతో మాట్లాడుతూ, పిల్లలు హత్యలు, అత్యాచారాలకు పాల్పడితే వారికి పెద్దలకు వేసే శిక్షే వెయ్యాలని అభిప్రాయపడ్డారు. పిల్లలు ఎంత పెద్ద నేరం చేసినప్పటికీ చట్టంలోని లొసుగులను ఉపయోగించుకుని కొంత మంది లాయర్లు వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు

  • Loading...

More Telugu News