: టీవీ ఛానల్ లైవ్ షో మధ్యలో వెళ్లిపోయిన రాంగోపాల్ వర్మ


ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఓ తెలుగు న్యూస్ ఛానల్ లైవ్ షోకి వచ్చాడు. ఇటీవల విడుదలైన ‘ఐస్ క్రీమ్’ సినిమా హారర్ సినిమా కాదని, హారిబుల్ అని సదరు ఛానల్ వారు సినిమా రివ్యూను ప్రసారం చేశారు. 6 మార్కులకు గాను 1.5 రేటింగ్ ఇస్తున్నామంటూ వారు చెప్పేశారు. దాంతో రాంగోపాల్ వర్మ లైవ్ షోలో ఫైర్ అయ్యాడు. ‘నా సినిమాలకు రివ్యూ రాసిందెవరు?’ అంటూ చిర్రుబుర్రులాడాడు. తన సినిమాల గురించి ‘కుక్కలు’ మొరిగితే పట్టించుకోనని అన్నాడు. దానికి టీవీ ఛానల్ ప్రతినిధి ‘కుక్కలు అని అనడం తప్పు కదా?’ అంటే... ‘కుక్క అని అనడం తప్పయితే, నన్ను ఉద్దేశించి ‘దురద తీర్చుకున్నా’నంటూ మీరు అనడం కరెక్టేనా? అంటూ ప్రశ్నించాడు. కార్యక్రమం జరుగుతుండగానే కోపంతో రాంగోపాల్ వర్మ మధ్యలో లేచి వెళ్లిపోయాడు.

  • Loading...

More Telugu News