: టీడీపీ ఎమ్మెల్యే తలసాని ఇంటికెళ్లిన కేసీఆర్
సనత్ నగర్ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్ ఇంటికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లారు. మహంకాళీ జాతరలో భాగంగా ఇవాళ సాయంత్రం తలసాని ఇంటి వద్ద ఫలహారపు బండికి కేసీఆర్ టెంకాయ కొట్టడంతో... ఊరేగింపు ప్రారంభమైంది. తన నియోజకవర్గంలోని సికింద్రాబాదు ఉజ్జయిని మహంకాళీ ఆలయంలో జరుగుతున్న జాతర ఏర్పాట్లను దగ్గరుండి తలసాని పర్యవేక్షిస్తున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ జాతర ఇవాళ రాత్రితో ముగియనుంది.