: కోట్లాది రూపాయలు దండుకున్న సిరి గోల్డ్ ఎండీ అరెస్ట్
ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించి, ఆపై బోర్డు తిప్పేసిన సిరి గోల్డ్ ఎండీ సుందరంను నెల్లూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. 2008 నుంచి 2013 వరకు సిరి గోల్డ్ పేరుతో ప్రజల నుంచి సుమారు రూ.95 కోట్ల డిపాజిట్లు సేకరించారని పోలీసులు చెప్పారు. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాలతో పాటు తమిళనాడులో సిరి గోల్డ్ ఫామ్స్ అండ్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ పేరుతో ఈ డిపాజిట్లను సేకరించినట్లు తెలియవచ్చింది. డిపాజిట్లు గడువు తీరినా, ఖాతాదారులకు చెల్లించకపోవడంతో నెల్లూరు జిల్లాలో సంస్థపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఎండీ సుందరంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో సుందరం కావలి రావడంతో, ఆయనను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.