: మోడీ మరో ఘనత... గుజరాత్ లో కరెంట్ తో నడిచే బస్సులు
విద్యుత్‌తో నడిచే బస్సులు నడపాలని గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించింది. గాంధీనగర్ - అహ్మదాబాద్ మధ్య ప్రయోగాత్మకంగా వీటిని ప్రవేశపెట్టనున్నట్టు గుజరాత్ అధికారులు తెలిపారు. సాంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో పాటు పర్యావరణాన్ని సమతుల్యతను కాపాడే ఆలోచనతో మోడీ, గుజరాత్ ముఖ్యమంత్రి ఉండగా 2009లో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. మోడీ ప్రధానమంత్రి అయ్యాక ఈ ప్రాజెక్ట్ కార్యాచరణకు రావడం విశేషం. సాంప్రదాయ ఇంధన వనరులైన డీజిల్, పెట్రోల్, గ్యాస్ తో వాహనాలను నడపడంతో గాలిలో కార్భన్ వాయువుల శాతం అధికమై వాతావరణ సమతుల్యతను దెబ్బతీస్తున్నాయని పర్యావరణ వేత్తలు ఎప్పటినుంచో గగ్గోలు పెడుతున్నారు. ఈ నేపధ్యంలో... గుజరాత్ ను క్లీన్ అండ్ గ్రీన్ గా మార్చాలనే ఉద్దేశ్యంతో మోడీ తన హయాంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ సోలార్ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ సిస్టమ్ అనే ప్రాజెక్టును డిజైన్ చేయించారు. ఈ ప్రాజెక్ట్ లో భాగంగానే అహ్మదాబాద్ నుంచి గాంధీనగర్ వరుకు 20 ఎలక్ట్రిక్ బస్సులను నడపనున్నారు....ఈ బస్సుల్లో విద్యుత్తును సోలార్ పవర్ ద్వారా జనరేట్ చేస్తారు...ఈ పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే గుజరాత్ రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభిస్తారు.