: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం


ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లు రాజ్యసభలోనూ ఆమోదం పొందింది. ఈ మేరకు మూజువాణి ఓటుతో సభ ఆమోదముద్ర వేసినట్లు డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ ప్రకటించారు. దాంతో, ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలు ఇప్పటినుంచి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ కు చెందుతాయి. పార్లమెంటు ఉభయ సభలు బిల్లుకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో రాష్ట్రపతి అంగీకారం ఇక లాంఛనప్రాయమే. కుక్కునూరు, వేలేరుపాడు, కూనవరం, చింతూరు, భద్రాచలం రూరల్, వీఆర్ పురం, బూర్గంపాడు (ఆరు గ్రామాలు) ఆంధ్రాలో విలీనం అయ్యాయి.

  • Loading...

More Telugu News