: పీబీ శ్రీనివాస్ కన్నుమూత
అలనాటి ప్రముఖ గాయకుడు పీబీ శ్రీనివాస్ (82) కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా నేటి మధ్యహ్నం ఆయన చెన్నైలో తుది శ్వాస విడిచారు. గతకొద్ది కాలంగా ఆయన తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నారు. దక్షిణాది భాషల్లో పలు హిట్ గీతాలు ఆలపించారు. శ్రీనివాస్ 1930లో కాకినాడలో జన్మించారు. సుమారు 200 చిత్రాల్లో పాటలు పాడిన ఈ గాయక దిగ్గజానికి దక్షిణాది భాషలే కాకుండా హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్ లలోనూ మంచి పట్టుంది. కొన్ని గజల్స్ ను కూడా రాశారు.