: 1956కు ముందు భద్రాచలం డివిజన్ తూ.గో జిల్లాలో ఉండేది: కేవీపీ
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లుపై రాజ్యసభలో చర్చ కొనసాగుతోంది. కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు మాట్లాడుతూ, 1956కు ముందు భద్రాచలం డివిజన్ ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో ఉండేదని చెప్పారు. తెలుగు మాట్లాడే ప్రాంతమంతా 1759కు ముందు నిజాం ఆధీనంలోనే ఉందని పేర్కొన్నారు. పోలవరం ప్రతిపాదన చాలా ఏళ్ల క్రితం నాటిదని, విభజనకు సహకరించిన వారే ఇప్పుడు విరుద్ధంగా మాట్లాడుతున్నారని అన్నారు. అయితే, బిల్లుకు తాను మద్దతిస్తున్నానని చెప్పారు. అనంతరం సభలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది.