: పోలవరం గొప్ప ప్రాజెక్టు... అడ్డుకోవద్దు: చిరంజీవి


పోలవరం గొప్ప ప్రాజెక్టు అని కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆయన కోరారు. ప్రస్తుత బిల్లులో పునరావాస ప్యాకేజీలు ఉన్నాయని ఆయన అన్నారు. ప్రాజెక్టు ద్వారా 80 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణాలోకి మళ్లించవచ్చునని చెప్పారు. 2.5 టీఎంసీల నీటిని ఛత్తీస్ గఢ్ అదనంగా వాడుకోవచ్చునన్నారు. ప్రస్తుత డిజైన్ తో పోలవరం వల్ల అనేక లాభాలున్నాయని చిరంజీవి చెప్పారు. ఈ ప్రాజెక్టు వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు లబ్ది చేకూరుతుందన్నారు. రాజకీయ లబ్ది కోసం ప్రాజెక్టును అడ్డుకోవడం సరికాదని ఆయన హితవు పలికారు. భద్రాచలం పట్టణాన్ని కూడా ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News