: పోలవరానికి మేం వ్యతిరేకం కాదు: ఎంపీ వీహెచ్
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని కాంగ్రెస్ ఎంపీ వి.హనుమంతరావు అన్నారు. అయితే ప్రాజెక్టు డిజైన్ ను తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ... పోలవరం వల్ల రాజమండ్రికి ముప్పు ఏర్పడుతుందని ఆయన అన్నారు. జైరాం రమేశ్ అన్ని ప్రాంతాలూ తిరుగుతారు కానీ, ఏ ఎంపీని కూడా కలవరని వీహెచ్ ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు పేరుతో గతంలో ఎంతో అవినీతి జరిగిందని ఆయన అన్నారు. కాగా, తనకు కేటాయించిన సమయం దాటిపోయినా వీహెచ్ మాట్లాడుతూనే ఉండడంతో... డిప్యూటీ చైర్మన్ కురియన్, కూర్చోవాలంటూ వీహెచ్ కి పలుమార్లు విజ్ఞప్తి చేశారు.