: నిర్భయ హంతకుల్లో ఇద్దరి ఉరిపై సుప్రీం స్టే


నిర్భయ హంతకుల్లో ఇద్దరి ఉరిశిక్షను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలుపుదల చేసింది. ఈ మేరకు నిందితులిద్దరు దాఖలు చేసుకున్న పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు శిక్ష అమలుపై స్టే విధించింది. 2012 డిసెంబర్ లో ఢిల్లీలో ఓ విద్యార్థినిపై కదులుతున్న బస్సులో అత్యాచారం జరిపిన దుండగులు, ఆమెతో పాటు ఆమె స్నేహితుడిని తీవ్రంగా గాయపరిచి, కిందకు తోసేసిన ఘటనలో బాధితురాలు చికిత్స పొందుతూ మృతి చెందిన సంగతి తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తగా, ఢిల్లీలో కనీవినీ ఎరుగని రీతిలో యువత రోడ్డెక్కింది. దీనిని సీరియస్ గా పరిగణించిన కేంద్రం, అత్యాచారాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించేందుకు ఉద్దేశించిన నిర్భయ చట్టానికి రూపకల్పన చేసింది. ఈ కేసును విచారించిన ఢిల్లీ హైకోర్టు నలుగురు నిందితులకు ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News